బుచ్చిబాబు సనా.. సొంత ఊరు పిఠాపురంలో ఇంటిని కట్టుకున్నారు. నూతన గృహ ప్రవేశ వేడుకలు శుక్రవారం జరిగాయి. భార్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు బుచ్చిబాబు. సింపుల్‌గా ఈ వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఉప్పెన సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు.
అలాగే జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉప్పెన సినిమా తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు బుచ్చిబాబు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో ‘పెద్ది’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే బిజీ బిజీగా ఉంటున్నాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్.
అయితే ఈ సినిమా కంటే ముందే మరో గుడ్ న్యూస్ చెప్పాడు బుచ్చిబాబు. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన అతను తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం న సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుచ్చిబాబు ఇప్పుడు అదే పిఠాపురంలో కొత్తిల్లు కట్టుకోవడం విశేషం.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బుచ్చిబాబుకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా గృహప్రవేశం కార్యక్రమం వల్లనే గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు బుచ్చిబాబు రాలేకపోయారు. అయితే ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్‌లో వినిపించారు.
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పిఠాపురం లో కొత్త ఇల్లు కట్టుకున్న పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా. శనివారం గృహ ప్రవేశ వేడుక జరిగింది.#Peddi #BuchiBabuSana #RamCharan pic.twitter.com/cOSJ3aIZLq
— Tollywoodtopics (@filmytopics) November 9, 2025
