యువత విచిత్రమైన స్టంట్స్ చేశాడు. అవి అత్యంత ప్రమాదకరమైనవి. హ్యాండిల్ వదిలేసి… బైక్ పై పడుకొని ఎక్సర్సైజులు చేశాడు. ఆ తర్వాత నిల్చున్నాడు, ఓ పక్కకు కూర్చున్నాడు. ఇలా ఎన్నో చేష్టలు చేశాడు. ఇవన్నీ బైక్ వెళ్తున్నప్పుడు, హ్యాండిల్ పట్టుకోకుండా చేశాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కొందరు రాత్రికి రాత్రి ఫేమస్ కావడానికి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.
ప్రమాదకరమైన స్టంట్స్ వీడియోలతో నెటిజన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా యువత మాత్రం వీడియోల కోసం స్టంట్స్ చేయడం మాత్రం మానడం లేదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక యువకుడు, అమ్మాయి బైక్ పై స్టంట్స్ చేస్తున్నట్లు చూడవచ్చు. కానీ కొన్ని సెకన్లలో, స్టంట్ ప్రాణాంతకంగా మారింది. వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు.
అలాంటి రీల్స్ తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియోలో, ఒక యువకుడు అధిక వేగంతో బైక్ నడుపుతున్నట్లు చూడవచ్చు. అతని వెనుక ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ యువకుడు అకస్మాత్తుగా బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి ఎత్తి వెనక చక్రం మీద కొంత దూరం నడుపుతాడు. వెనుక కూర్చున్న అమ్మాయి తన బ్యాలెన్స్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
కానీ, ఆ యువకుడు బైక్‌ను వెనక్కి కిందకు దించడానికి ప్రయత్నించడంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోతుంది. అబ్బాయి, అమ్మాయి రోడ్డుపై పడతారు. రోడ్డును చాలా బలంగా ఢీకొంటారు. వెనుక నుండి వస్తున్న మరో బైక్ కూడా ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేయబడింది.
रील बनाने के लिए जान से खिलवाड़#BikeStuntvideo pic.twitter.com/YtDIUQBIRA
— DHARMENDRA SINGH (@iDharmksingh) November 1, 2025
