Ayurvedic Power: చర్మ వ్యాధులను మాయం చేసే బావి. ఈ నీళ్లు అమృతంతో సమానం..! నీళ్ళ కోసం పోటెత్తుతున్న జనం.

divyaamedia@gmail.com
3 Min Read

Ayurvedic Power: చర్మ వ్యాధులను మాయం చేసే బావి. ఈ నీళ్లు అమృతంతో సమానం..! నీళ్ళ కోసం పోటెత్తుతున్న జనం.

Ayurvedic Power: చర్మ వ్యాదులు, ఒళ్లు మంటలు దురద వంటి రోగాలకు ఈ చుండెలుక బావి నీళ్ళే ఔషదం.. మనుషులకే కాకుండా సాదు జంతువులకు కూడా ఈ నీళ్ల ఓ మెడిసిన్‌లా పనిచేస్తాయనే టాక్ ఇక్కడ ఉంది. ఆదివారం, గురువారం ఈ రెండు రోజుల్లో వరుసగా ఏడు వారాల పాటు ఈ బావి నీళ్లతో స్నానం చేయడం, ఎడమ చేత్తో ఏడు గుక్కల నీళ్లు తాగడం, వంట కూడా ఈ నీళ్లతోనే చేసుకోవడం వల్ల చాలా మందికి చర్మవ్యాదులు తగ్గాయని ఇక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. పూర్తీ వివరాలోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కోరుట్ల పట్టణలను కలిపే మార్గం మధ్యలో వేములవాడ నుండి 18 కి.మీ. దూరంలో చందుర్తి మండలం మల్యాల గ్రామం అనగానే సుదూర ప్రాంతాల వారికి, చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుండేలుక బావి.

Also Read: అరచేతిలో దురదగా ఉంటే, మీకు నిజంగానే డబ్బు వస్తుందా..?

చుందెలుక కరచి చర్మ వ్యాధులు, మంటలు, దురద వంటి రోగాలకు ఈ చుందెలుక బావి నీళ్ళు దివ్యౌషధంగా మారింది. మనుష్యులకే కాకుండా. సాదు జంతువులకు కూడా ఈ నీళ్లు ఔషధం లాగా పనిచేస్తాయి. ఆదివారం, గురువారం ఏడు వారాలు ఈ బాని నీళ్లతొ స్నానం చేయడం (ఎడమ చేత్తో స్నానం చేసుకోవడం, ఎడమ చేత్తో ఏడు బుక్కల నీళ్లు తాగడం) వంట కూడా ఈ నీళ్లతోనే చేసుకోవడం వల్ల చాలా వరకు చాలా మందికి చర్మ వ్యాధులు తగ్గాయని గ్రామస్తులు తెలిపారు. ఎలుక కరిచిన తర్వాత ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల చుట్టు తిరిగినా, ఎన్ని మందులు వాడిన తగ్గని చర్మ వ్యాధులు ఈ బావి నీళ్ల తాగితే నయం అవుతాయంటున్నారు.

ఇలా నయం అయిన వారు ఆ నోటా, ఈ నోటా ప్రజలలో ప్రచారం కావడంతో చుట్టూ ప్రక్కల ప్రాంతాలవారే కాకుండా, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుండి కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. బావి నీటితో వంట చేసుకుని వ్యాధి తగ్గేవరకు ఇక్కడే ఉంటున్నారు. బావి ఎలా వెలసిందని తెలుసుకోగా, గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం వేల సంవత్సరాల క్రితం ఒక సన్యాసి స్వామీజీ వచ్చి గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ ఊరికి కాస్త దూరంగా నివాసం ఏర్పరుచుకున్నారు. ఇదే గ్రామంలోని కొందరు చుందెలుక కరచి చర్మం వుండలుగా తయారై దురదతో ఇబ్బంది పడటం చూసి వారిని తన నివాస స్థలానికి రమ్మని పిలిపించుకున్నారు.

Also Read: ఈ ఆలయంలో చీపురు సమర్పిస్తే చాలు, ఆ రోగాలు వెంటనే తగ్గిపోతాయి.

అతను వచ్చాక చూసి సన్యాసి నివాసం ఉండే ప్రక్కన తన చేతులతో ఒక నీటి గుంట తవ్వి అందులో పంచ లోహాలు, రాగి పత్రాన్ని ఆ గుంటలో పెట్టీ గుంటలో ఊరిన నీళ్ళతో ఏడు వారాలు స్నానం చెయ్యమని ప్రతి గురు, ఆదివారం స్నానం ఆచరించాలని చెప్పాడని బావి చరిత్ర తెలిసిన గ్రామపెద్దలు తెలిపారు. తమ చర్మ రోగం పూర్తిగా తగ్గడంతో కాల క్రమంలో కుంటను బావిగా తవ్వి చుట్టూ గాజులు పోసి ఆ బావిని ఇప్పటికి రక్షిస్తున్నారు గ్రామస్తులు. రాను రాను ఆ బావి పేరు చుందేలుక బావి అని పిలుస్తున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *