దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రావడంతో ఒక్కసారి అలజడి చోటు చేసుకుంది. ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాధురి రావడం రావడంతో హౌజ్మేట్లకి కౌంటర్లిస్తూ కంటెంట్ ఇచ్చింది. మంచా, చెడా అనేది పట్టించుకోకుండా అందరిపై నోరేసుకుని పడిపోతుంది. ఆమె రమ్య మోక్షతో చాలా క్లోజ్‌గా ఉంది. అయితే దివ్వెల మాధురీ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హౌస్ లో కంటెస్టెంట్ లను ఒక రేంజ్ లో చెడుగుడు ఆడుకొవడం స్టార్ట్ చేశారు.
కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్ని కూడా దివ్వెల మాధూరీ పెద్దది చేసుకుని రచ్చరాజేశారు. అయితే తాజాగా.. 48 వ రోజుకు సంబంధించిన ఒక ప్రొమో నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే నాగార్జున కంటెస్టంట్ లను ఒక రేంజ్ లో ఉతికి ఆరేస్తుంటారు. ఈ ప్రోమోలో.. పచ్చళ్ల పాప రమ్య ఎలిమినేట్ అయినట్లు చూపించారు. అయితే.. దీనిలో నాగార్జున దివ్వెల మాధురీపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ముఖ్యంగా రీతు చౌదరీపై కింద వేసి తొక్కుతా.. గట్టిగా మాట్లాడటంపై నాగార్జున దివ్వెల మాధురికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రీతుపై చేసిన నోటీదూల వ్యాఖ్యలకు.. నువ్వు తోపు అయితే.. బయట చూసుకో గాని హౌస్ లో కాదంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు. అయితే..దీనిపై రియాక్ట్ అయిన దివ్వెల మాధురీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చింది.
ఇలాంటి పనులు బయట చేసుంటే.. జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేదాన్నని చెప్పుకొచ్చింది. కానీ నాగార్జున మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. ఇదే లాస్ట్ సారి చెప్తున్నానని.. నేలకేసి కొడతాను, తోక్కుతా, తాటతీస్తా అంటే బాగోదని.. హౌస్ లో కాదు.. బైట చూపించుకొవాలని దివ్వెల మాధురికి నాగార్జున కూల్ గానే ధమ్కీ ఇచ్చారు. ఈ ప్రొమో వీడియో వైరల్‌గా మారింది.
