విశాఖపట్నంలోని ఓ పంజాబీ కుటుంబంలో 5 ఏప్రిల్ 1985లో జన్మించారు పూనం బజ్జా. తల్లిదండ్రులు అమర్జీత్ సింగ్ బజ్వా, జయలక్ష్మీ బజ్వా. ఆమె తండ్రి నేవీ ఆఫీసర్ . పూనంకు సోదరి దీపికా బజ్వా కూడా ఉన్నారు. తొలుత మోడలింగ్ రంగంలో దిగిన ఆమె.. మిస్ పూణే 2005 కీరిటం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే టాప్ కంపెనీలకు చెందిన పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
దాంతో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేసింది. అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. అలాగే కన్నడ, మలయాళంలోనూ ట్రై చేసింది. అయినా సక్సెస్ అవ్వలేదు. ఓ దర్శకుడిని రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లోనూ నిలిచింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
వారిలో పూనమ్ బజ్వా ఒకరు. నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత ప్రేమంటే ఇంతే అనే సినిమాలో నటించారు. ఆతర్వాత నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో కనిపించింది.
ఈ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ‘ఓం త్రీడి’ సినిమాను తెరకెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్‌కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. దీని పై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
