కింగ్ కోబ్రా, పైథాన్ లాంటి పాములను చూస్తే ఇంకేముంది.. అమ్మబాబోయ్ అంటూ గుండె చేతిలో పట్టుకోవడమే.. గజగజ వణికిపోతూ ఆ ప్రాంతంలోనే అస్సలు ఉండము.. విష నాగుల భయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. అవి కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం.. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కనిపించింది.
దీంతో అక్కడున్న వారు.. ఉరుకులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది.. అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కు చుక్కలు చూపించింది. అది తిరగబడటంతోపాటు.. బుసలు కొడుతూ అందరినీ షేక్ చేసింది. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదివారం హరిద్వార్‌లోని చండి ఘాట్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున 13 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా కనిపించింది.. ఇది స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పామును చూసి స్థానికులు ఆందోళన చెందారు.. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అనంతరం ఒక రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సుమారు గంటసేపు ఆపరేషన్ తర్వాత, కింగ్ కోబ్రాను సురక్షితంగా పట్టుకుంది. ఆ పాము దాదాపు 13-15 అడుగుల పొడవు ఉండటంతోపాటు.. చాలా చురుకైన స్థితిలో ఉంది.
స్థానిక నివాసితుల సహాయంతో రెస్క్యూ బృందం గంగా నది ఒడ్డున పామును విజయవంతంగా రక్షించింది. అటవీ శాఖ సిబ్బంది ఆపరేషన్ అంతటా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ పైకి దూసుకువచ్చింది.. చాలా సేపు అలానే మీదకు దూసుకువచ్చింది.. దీంతో స్నేక్ క్యాచర్ చాకచక్యంగా వ్యవహరించి భారీ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు.
King Cobra Creates Panic in Kankhal, Rescued by Forest Department
— Kumaon Jagran (@KumaonJagran) October 26, 2025
An angry and ferocious King Cobra created panic in the Lakkar Basti area of Kankhal Bairagi Camp on Sunday. Locals were terrified after spotting the massive and aggressive snake slithering through the settlement.… pic.twitter.com/z8drKSDwNM
