బంగారం ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. పెట్టుబడిదారులు , కొనుగోలుదారులు ఈ మార్పులను నిశితంగా గమనిస్తూ ఉంటారు. తాజాగా, హైదరాబాద్ బంగారు మార్కెట్‌లో అత్యంత ముఖ్యమైన రెండు వర్గాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. అయితే బంగారం ధరల భగభగతో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఏడాది కిందట సుమారు రూ. 70,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ. 1, 20,000 మార్కును దాటింది.
అంటే ఒక్క ఏడాదిలోనే బంగారం ధర 60శాతం పెరగడం గమనార్హం. అయితే ఇవాళ బంగారం ధరలు తగ్గడం కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ గోల్డ్ ధరలు ఏకంగా రూ.వెయ్యికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480గా ఉంది. నిన్న ఇది రూ.1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,14,100 గా ఉంది. ఇది నిన్న రూ.1,15,150 గా ఉంది.

బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో చూసుకంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,24,480గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,14,100 ఉండగా.. నిన్న రూ.1,15,150గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం ధరలు రూ.1140 రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.93,360గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,24,480గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,100గా ఉండగా.. నిన్న 1,15,150గా ఉంది.
ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,24,910 ఉంది. ఈ ధర నిన్న రూ.1,25,450గా ఉండేది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,480గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,100గా ఉంది. కాగా మూడు రోజుల ముందు వరుసగానాలుగైదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ నెల 25న 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1250 పెరిగింది. దాంతో మహిళలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇవాళ తిరిగి బంగారం ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.
