ఈ స్టార్ హిరోయిన్ 2002లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన “మేరే యార్ కి షాదీ హై” చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఉదయ్ చోప్రా, జిమ్మీ షెర్గిల్, బిపాషా బసు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి సంజయ్ కద్వి దర్శకత్వం వహించారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తెలుగు భాషలలో కూడా నటించారు.
దులీప్ జోషి తండ్రి గుజరాతీ హిందువు. ఆమె తల్లి అర్మేనియన్ క్రైస్తవురాలు. ముంబైలో జన్మించిన దులీప్ జోషి జమ్నాబాయి నర్సీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. 2000లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ‘సంజన’ పేరుతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. తన పేరును దులీప్ జోషిగా మార్చుకుంది.

తెలుగు, హిందీ, తమిళం భాషలోల నటించిన దులీప్ జోషీ.. కెప్టెన్ వినోద్ నాయర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త వినోద్ నాయర్ మాజీ భారత ఆర్మీ అధికారి, 1995 వరకు సైన్యంలో పనిచేశారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన దులీప్ జోషి.. తన భర్తతో కలిసి వ్యాపారాల్లో పాల్గొంటుంది. శిక్షణ కన్సల్టెన్సీ, కిమయ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా ఉన్నారు.
అప్పుడప్పుడు ధ్యానం, యోగా వీడియోలను పోస్ట్ చేస్తుంది దిలీప్ జోషి. హిందీలో దులీప్ జోషీ.. ‘ఎయిర్‌లైన్స్’, ‘దిల్ మాంగ్కే మోర్’, ‘మిషన్ 90 డేస్’, ‘రన్‌వే’, ‘ధోకా’, ‘మాతృభూమి’, ‘సూపర్‌స్టార్’, ‘బచ్చన్’, ‘జాట్ ఎయిర్‌వేస్’, ‘జై హో’ వంటి చిత్రాలలో నటించింది. అలాగే పలు సీరియల్స్ సైతం చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రచారకురాలిగా మారింది.
