ఆయుర్వేదంలో ఈ మొక్కలను విరివిగా ఉపయోగిస్తుంటారు. అనేక ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. అలాంటి మొక్కల్లో బ్రహ్మి మొక్క కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. కానీ చాలా మందికి ఈ మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ఈ మొక్క ఆకులు గుండ్రంగా మందంగా ఉంటాయి. అయితే బ్రహ్మీ అభిజ్ఞా పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
బ్రహ్మీ మూలిక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగిస్తుంది. హైబీపీని కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి బ్రహ్మీ మూలిక మంచి ఎంపిక. బ్రహ్మీ మూలిక జీవక్రియ రేటును పెంచుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. హైబీపీని కంట్రోల్ చేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో బ్రహ్మీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కాలేయ సంబంధిత సమస్యలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యానికి బ్రహ్మీ క్యాప్సూల్ చాలా మేలు చేస్తుంది. మధుమేహం నియంత్రణలో కూడా బ్రహ్మీకి బ్రేక్ లేదు. ఈ ఔషధం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బ్రహ్మీ మూలికలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది. బ్రహ్మీ మూలికను వివిధ రూపాల్లో తీసుకుంటే మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో బ్రాహ్మి చాలా ప్రభావవంతమైన ఔషధం. బ్రహ్మీ మూలిక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రహ్మీ మూలికను వాడటం వల్ల తామర, సొరియాసిస్, మొటిమలు తగ్గుతాయి. ముడతలు కూడా మాయం అవుతాయి.
