రైలులో నుంచి ఫోన్ లేదా పర్సు పడిపోయిందా..! ఈ ఒక్క పనిచేస్తే పోలీసులే తెచ్చిస్తారంట..!

divyaamedia@gmail.com
1 Min Read

రైలులో విండో పక్కన కూర్చున్నపుడు ఫోన్, పర్స్ లాంటి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.. పొరపాటున ఏదైనా వస్తువు కింద పడిపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలు రాసిపెట్టుకోవాలి. ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో వ్రాసిన నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఏ రెండు స్టేషన్ల మధ్య పడిపోయిందనేది గుర్తుంచుకోవాలి.

వేరే ఫోన్ తో రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 182 లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి ఫిర్యాదు చేయాలి. అయితే తోటి ప్రయాణీకుల ఫోన్ తీసుకొని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 182 కు కాల్ చేయండి. ఫోన్‌ ఎక్కడ పోయిందో చెప్పండి. ఇంకా కచ్చితంగా అక్కడ పోల్స్‌ నంబర్స్‌, లేక స్టేషన్‌ దాటిన తర్వాత, వచ్చే ముందు ఇలా గుర్తులు చెప్పండి.

దాంతో పాటు రైలు నంబర్, కోచ్ నంబర్, ఫోన్ పడిపోయిన సుమారు స్థానం, మీ సంప్రదింపు వివరాలు చెప్తే.. వాళ్లు వెంటనే సమీప స్టేషన్‌లోని RPF బృందాన్ని అప్రమత్తం చేస్తారు. వారు ఫోన్‌ను తిరిగి పొందగలరు. 182 అందుబాటులో లేకపోతే, ప్రయాణీకులు 1512 (ప్రభుత్వ రైల్వే పోలీసు హెల్ప్‌లైన్) లేదా సాధారణ రైల్వే ప్రయాణీకుల హెల్ప్‌లైన్ 138ని కూడా సంప్రదించవచ్చు.

ఒక వేళ ఫోన్‌ ఆర్పీఎఫ్‌ వారికి దొరికితే దాన్ని సమీపంలోని RPF లేదా GRP పోస్ట్‌లో ఉంచుతారు. ప్రయాణీకులకు రిఫరెన్స్ లేదా ఫిర్యాదు నంబర్ అందుతుంది, దీనిని ఉపయోగించి శోధన స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఫోన్‌ను క్లెయిమ్ చేయడానికి, యజమాని చెల్లుబాటు అయ్యే IDని చూపించి, ధృవీకరణ తర్వాత దానిని అందజేసే ముందు పరికరం గురించి కీలక వివరాలను నిర్ధారించాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *