ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) చట్టం, 2025 కింద నామినేషన్‌కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. సెక్షన్లు 10, 11, 12, 13 ద్వారా తీసుకురాబడిన నిబంధనలు డిపాజిట్ ఖాతాలు, సురక్షిత కస్టడీలో ఉంచబడిన వస్తువులు, బ్యాంకుల వద్ద నిర్వహించబడే భద్రతా లాకర్ల విషయాలకు సంబంధించిన నామినేషన్ సౌకర్యాలకు సంబంధించినవి. అయితే ఈ మధ్య కాలం నుంచి సైబర్ నేరాలు పెరిగిపోయాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారునికి ఫోన్ చేసి కొన్ని నిమిషాల్లోనే బ్యాంకు అకౌంట్ ఉన్న డబ్బులను దోచేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ఎన్నో జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వినియోదారులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక కస్టమర్ ఖాతా సైబర్ మోసానికి గురై మూడు రోజుల్లోపు బ్యాంకుకు నివేదిస్తే, అతని ఎటువంటి నష్టం ఉండదని ఆర్‌బిఐ పేర్కొంది.

అదనంగా అటువంటి సందర్భాలలో బ్యాంక్ సకాలంలో చర్య తీసుకోకపోతే రూ. 25,000 వరకు జరిమానా విధిస్తుంది. దీని కోసం బ్యాంకులు సైబర్ భద్రత గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి. లాకర్ వివాదాల్లో కస్టమర్లకు ఉపశమనం.. ఇక చాలా మంది లాకర్ లను ఉపయోగిస్తుంటారు. లాకర్ సంబంధిత వివాదాలు కూడా వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా పెద్ద మార్పుకు గురయ్యాయి. కస్టమర్ లాకర్ దొంగిలించినా లేదా దెబ్బతిన్నా లేదా బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా జరిగినా బ్యాంకు లాకర్ అద్దెకు 100 రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
కస్టమర్లకు నష్టం కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. సులభమైన KYC ప్రక్రియ..కొత్త నిబంధనలు KYC ప్రక్రియను మరింత సులభతరం చేస్తాయి. సాధారణ ఖాతాలకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, మధ్యస్థ రిస్క్ ఖాతాలకు ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి, అధిక రిస్క్ కస్టమర్లకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ పూర్తవుతుంది. ఇది కస్టమర్‌ను మళ్లీ మళ్లీ పత్రాలను సమర్పించే ఇబ్బంది నుండి విముక్తి చేస్తుంది. రుణ నియమాలలో మెరుగుదలలు..వినియోగదారులకు క్రెడిట్ విషయాలలో కూడా గణనీయమైన ఉపశమనం లభించింది.
అన్ని బ్యాంకులు ఇప్పుడు వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఏకరీతి సూత్రాన్ని అనుసరించాలి. పారదర్శకతను నిర్ధారిస్తాయి. అదనంగా అన్ని రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుములు లేకుండా గడువుకు ముందే రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు.. ఇది 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తుంది.
దీని అర్థం వారు బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. బ్యాంకు అధికారులు వారి ఇంటి వద్దే అవసరమైన సేవలను అందిస్తారు. కొత్త నియమాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి.. ప్రజలు, బ్యాంకుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జనవరి 1, 2026, ఏప్రిల్ 1, 2026 మధ్య కొత్త నియమాలు క్రమంగా అమలు అవుతాయని RBI తెలిపింది. ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచుతాయి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థను మరింత జవాబుదారీగా చేస్తాయి.
