షకీలా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోయేవి ఆమె సినిమాలు. విపారీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఏకైక శృంగార తారగా నిలిచారు. అయితే చాలా వివాదాల్లో కూడా ఆమె చిక్కుకున్నారు. అయితే షకీలా .. సిల్వర్ స్క్రీన్‌పై బోల్డ్ క్యారెక్టర్లతో అలరించిన ఈ సీనియర్ నటి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
తమిళనాడులోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె తన స్టార్ డమ్ తో సూపర్ స్టార్లకు షాక్ ఇచ్చారు. వారికి సమానంగా రెమ్యునరేషన్లు తీసుకున్నారు. అయితే కుటుంబ పోషణ కోసం సినిమాల్లోకి అడుగుపెట్టారు షకీలా. 18 ఏళ్లకే నటిగా మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ సినిమాల్లో సందడి చేసింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్లు తీసుకున్నారు. అయితే సినిమాల్లో బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలో కూడా అలాగే ఉందనుకుంటారు చాలామంది.
అయితే అది చాలా పొరపాటు. షకీలా తన కుటుంబ పోషణ కోసమే సినిమాల్లోకి అడుగుపెట్టానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పైగా సినిమాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. ఇక నటిగా విరామం ఇచ్చాక పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారామె. ముఖ్యంగా 50 మంది ట్రాన్స్జెండర్లకు ఆమె ఆశ్రమిస్తున్నారు. సొంత ఖర్చులతో వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు.
కాగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షకీలా ఆ మధ్య బిగ్‌బాస్ ఏడో సీజన్లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. హౌస్‌లోకి రాగానే ఆమె ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
