చట్టాలను రక్షించాల్సిన ఓ న్యాయవాది కోర్టులో వాదనలు జరుగుతుండగానే పాడుపనులు చేస్తూ దొరికిపోయాడు. కెమెరా ఆఫ్ ఉందని అనుకున్నాడో ఏమో గానీ లోకాన్ని మరచి ముద్దుల్లో మునిగిపోయాడు. అయితే డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రతిదీ సాధ్యమే.. ఆ నేపథ్యంలోనే, కోర్టులలో కేసు విచారణ సమయంలో ఆన్లైన్లో హాజరు కావడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా, ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చినప్పుడు, ఒక న్యాయవాది ఆన్లైన్లో హాజరయ్యారు. ఆ సమయంలో, న్యాయమూర్తి రాకపోవడంతో అందరూ వేచి ఉన్నారు. ఆన్లైన్లో కనిపించిన ఒక న్యాయవాదికి ఒక మహిళ ముద్దు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోలో, న్యాయమూర్తి కోర్టు గదిలోకి వచ్చే వరకు అందరూ వేచి ఉన్నారు. విచారణ కోసం ఒక న్యాయవాది ఆన్లైన్లో కనిపించాడు. అతను కెమెరా నుండి కొంచెం దూరంగా ఉన్నాడు. అయితే, అతని ముఖం సగం కనిపిస్తుంది. ల్యాప్టాప్ ముందు కుర్చీలో కూర్చున్న న్యాయవాది, తన పక్కన నిలబడి ఉన్న మహిళను పిలిచి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.
ఇది అన్లైన్లోని వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతుండగా, న్యాయవాది చర్యలను ఖండిస్తూ చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Welcome to Digital India Justice 😂
— ShoneeKapoor (@ShoneeKapoor) October 15, 2025
Court is online… but judge forgot it’s LIVE! ☠️
When tech meets tradition
— and the camera off button loses the case! 🤣 pic.twitter.com/1GbfOFQ6w7
