చాలామంది స్టార్స్ ని దాటుకొని గూగుల్ సెర్చ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది త్రిప్తి డిమ్రీ. ఇది కూడా తక్కువ విషయమేం కాదు. ఈ పరిణామంపై తెగ సంబరపడిపోతున్నది ఈ అందాలభామ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా గురించి తెలుసుకోవాలని ఇంతమంది ఉత్సాహపడ్డారంటే అది నిజంగా నా విజయమే. అయితే చాల మంది హీరోయిన్ ఈ మధ్య ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాగే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో చాలా మంది నటించి ఆకట్టుకున్నారు.
అలాగే ఈ మూవీ కీలక పాత్రలో త్రిప్తి డిమ్రీ కూడా నటించింది. ఆమె కనిపించింది కొంత సేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యానిమల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ భామ. యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీ పేరు మారుమ్రోగింది. ఎక్కడ చూసిన ఈ అమ్మడి గురించే మాట్లాడుకున్నారు. యానిమల్ సినిమా హిట్ అవ్వడంతో త్రిప్తి డిమ్రీ కి ఆఫర్స్ వెల్లువెత్తాయి.
గత ఏడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలైయా 3 అనే సినిమాల్లో చేసింది. బ్యాడ్ న్యూజ్ సినిమాలో అందాలతో అదరగొట్టింది త్రిప్తి డిమ్రీ. దాంతో ఈ బ్యూటీకోసం గూగుల్ లో నెటిజన్స్ తెగ గాలించారు. అలా ఈ అమ్మడు మోస్ట్ గూగుల్ సర్చ్డ్ హీరోయిన్ గా గత ఏడాది టాప్ లో నిలిచింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ హాట్ బాంబ్.