ముంగీసను ఎన్నిసార్లు పాము కాటు వేసిన కూడా అది చచ్చిపోదు. దీని వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముంగీసల శరీరం మీద దట్టమైన, గుబురుగా వెంట్రుకలు ఉంటుంది. ఇది పాము కాటును లోపలి శరీరం వరకు వెళ్లకుండా ఆపేస్తుంది. అయితే వీడియోలో పాము తన పడగను విప్పి కూర్చుని ఉంటుంది.
దాని వెనుక ఒక చిన్న ముంగిస కూడా ఉంది. మొదట్లో అవి పోట్లాడితే పాము విజయం సాధిస్తుందని అనిపిస్తుంది. కానీ వారి పోరాటం ప్రారంభయ్యాక గానీ అసలు అక్కడ జరగబోయేదేంటో తెలుస్తుంది. నిజానికి ముంగిస ఈ పోరాటాన్ని ప్రారంభించింది. అది వెనుక నుండి పామును ఆటపట్టించింది. ఇది పాముకు కోపం తెప్పించింది.
ఆపై రెండూ పోరాడటం ప్రారంభించాయి. ముంగిస మెరుపు వేగంతో పాము నోటిని వదలకుండా పట్టుకుంది. ముంగిస ముందు పాము మొత్తం బలం పనికిరాకుండా పోయింది. ఈ భయానక పోరాట వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AmazingSights అనే ఖాతా షేర్ చేసింది. “ఏమీ జరగనట్లుగా ముంగిసలు కోబ్రాలను చంపే విధానం” అనే క్యాప్షన్ రాసి ఉంద. ఈ వైరల్ వీడియోను వేల సార్లు వీక్షించారు వందలాది మంది కామెంట్స్ చేశారు.
ముంగిస నిజంగా పాముకి అత్యంత ఘోరమైన శత్రువు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది ప్రకృతికి అత్యంత ప్రమాదకరమైన ఆట అంటూ మరికొందరు పోస్టు పెడుతున్నారు. ఈ వీడియో చూస్తున్నప్పుడు పాములు, ముంగిసల మధ్య పోరాటాలను ప్రదర్శించే చిన్ననాటి కథలను గుర్తుకు తెచ్చారని కూడా మరికొంత మంది అంటున్నారు.
The way mongooses just take down cobras like it's nothing pic.twitter.com/qxJAJO7f6X
— Damn Nature You Scary (@AmazingSights) October 9, 2025