హరికృష్ణ- ఎన్టీఆర్ లతో ఎంతో మంది హీరోయిన్లు కలిసి నటించారు.భానుప్రియ, సౌందర్య, రమ్యకృష్ణ, సిమ్రాన్ వంటి అందాల తారలు హరికృష్ణతో జోడీ కట్టారు. ఇక ఎన్టీఆర్ తో అయితే అమీష పటేల్, సమీరా రెడ్డి, అలియా భట్ వంటి బాలీవుడ్ నటీమణులు కూడా రొమాన్స్ చేశారు. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఈ హీరోలిద్దరితో కలిసి నటించింది.
తండ్రీ కొడుకులతో కలిసి ఆడిపాడింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ నటి రమ్యకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది రమ్యకృష్ణ. తారక్ తో కలిసి స్టెప్పులేసింది. అలాగే నా అల్లుడు సినిమాలోనూ ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ లు చేసింది. అంతకు ముందు హరికృష్ణ నటించిన ఒక సినిమాలో కథానాయికగా నటించింది రమ్యకృష్ణ.
సముద్ర తెరకెక్కించిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో హరికృష్ణతో కలిసి నటించిందీ అందాల తార. అలా మొత్తానికి తండ్రీ కొడుకులిద్దరితో కలిసి ఆడిపాడిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ, రమ్యకృష్ణలది టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రుక్మిణీ వసంత్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు దేవర 2 సినిమాలోనూ తారక్ నటించాల్సి ఉంది. అలాగే మరికొన్ని సినిమాలకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.