వాస్తవానికి ఈ జంట తమ తొలి చిత్రం ఏమాయ చేశావే సమయంలోనే ప్రేమలో పడిన ఆ విషయాన్ని చాలా కాలం సీక్రెట్‌గా ఉంచారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంట్లో వాళ్లకి చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సమంత అక్కినేని వారి కోడలిగా మారడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే చక్కగా సాగుతున్న సామ్, చైతూ సంసారంలో ఒకరు చిచ్చు పెట్టారని తెలుస్తోంది.
అతడి వలనే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. అతడే రాజ్ నిడిమోరు. రాజ్ దర్శకత్వంలో సమంత నటించింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నటించడం.. అందులో బోల్డ్‌గా కనిపించడం చైతూకు నచ్చలేదని టాక్. వెబ్ సిరీస్ సమయంలోనే రాజ్ నిడిమోరుతో సమంత చాలా సన్నిహితంగా మెలుగుతుండేదని పరిశ్రమలో పుకార్లు ఉన్నాయి. మరోసారి రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’లో కూడా సమంత నటించింది.

రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉండడం చైతూ తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ వ్యవహారంలో చైతూ, సమంత మధ్య చిచ్చు పెట్టిందని సమాచారం. రాజ్‌తో పరిచయం మరింత ఎక్కువై ప్రేమగా మారడంతో ఇక సమంతకు చైతూ విడాకులు ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. సమంత, చైతూ జంట విడిపోవడానికి రాజ్ నిడిమోరు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
విడాకుల అనంతరం రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉండడమే కాకుండా ముంబైలో సహ జీవనం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆ పుకార్లకు మరింత బలం వచ్చేలా సమంత, రాజ్ తరచూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల ముంబైలో వారిద్దరూ ఒక జిమ్ వద్ద కనిపించారు. అంతకుముందు తిరుమల పర్యటనలో.. సమంత నటించిన సినిమా సక్సెస్ ఈవెంట్‌లో రాజ్ ప్రత్యక్షమయ్యారు.
వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో సమంత, రాజ్ నిడిమోరు మధ్య కొత్త బంధం ఏర్పడిందని స్పష్టంగా చెప్పవచ్చు.