చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తండ్రి కావడంపై అర్బాజ్ మాట్లాడుతూ, తనకు కొంచెం టెన్షన్ గా ఉందని ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులుగా మారే ఎవరికైనా, రెండోసారి అయినా, ఇలాంటి భావనలు సహజమని వివరించాడు. ఈ అనుభవం తన జీవితంలోకి కొత్త ఆనందాన్ని, బాధ్యతను తెచ్చిందని, దాన్ని తను ఎంతో అభినందిస్తున్నానని చెప్పాడు. అయితే అనూహ్యంగా వీరి దాంపత్య జీవితంలో గొడవలు, కలహాలు మొదలయ్యాయి.
భార్యాభర్తలుగా కలిసుండలేమని పరస్పరం అనుమతితో విడాకులు తీసుకుని విడిపోయారు. 2017లో తన భార్యతో విడిపోయిన ఈ స్టార్ నటుడు సుమారు ఆరేళ్లు ఒంటరిగానే ఉన్నాడు. ఇదే క్రమంలో మరో నటితో ప్రేమలో పడ్డాడు. తన తోనే కలిసి రెండో సారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు 58 ఏళ్ల వయసులో రెండో సారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతను మరెవరో కాదు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్.
నటి మలైకా అరోరాతో విడాకులు తీసుకున్న తర్వాత, అర్బాజ్ ఖాన్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను. 2023 డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం న షురా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన సల్మాన్ కూడా ఆస్పత్రికి వెళ్లాడు. కాగా అర్బాజ్ ఖాన్ ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా తదితర సినిమాల్లో నటించాడు.
ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ మూవీలో విలన్‌గా నటించాడు ఆర్బాజ్ ఖాన్. అలాగే కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడీ సీనియర్ యాక్టర్.