మానసి సుధీర్ . కాంతార సినిమాలో హీరో తల్లి కమల అనే పాత్రలో నటించింది. సినిమాలో ఆమె చాలా వయసున్న పాత్రలో నటించింది కానీ బయట చాలా యంగ్. సినిమా ఈమె నటనను చూసి అంతా ఈమెను సీనియర్ నటి అని కూడా అనుకుంటున్నారు. కానీ కాదు. ఆమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది.
అయితే కాంతార చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కొన్ని నిమిషాల పాటు వేరే ప్రపంచంలో విహరింపజేసింది. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకుడు ఆ చిత్రంలో నుండి బయటకు రాలేదు. కాంతార చిత్రం మదిని వెంటాడుతుంది. సినిమాలో చాలా పాత్రలు గుర్తుండి పోతాయి. కాగా కాంతార చిత్రంలో హీరో తల్లి పాత్ర అలరించే అంశాల్లో ఒకటిగా ఉంది.
ఎద్దంత కొడుకుని, అతని స్నేహితులను భయపెట్టే రెబల్ మదర్ గా ఆమె పాత్ర ఆసక్తి గొలుపుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఆమె నటన హైలెట్. ఆ నడి వయసు పాత్ర చేసింది మాత్రం ఒక యంగ్ లేడీ. ఆమె వయసు 40 ఏళ్ళు లోపే అని సమాచారం. ఆ నటి పేరు మానసి సుధీర్. చక్కని రూపం, నాజూకు శరీరం ఆమె సొంతం. కన్నడలో అనేక సినిమాలు, సీరియల్స్ లో మానసి సుధీర్ నటించారు.
పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుచుకున్నారు. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన మానసి సుధీర్ గొప్ప సింగర్ కూడాను. ఆమె నటి అవుతారని ఎప్పుడూ అనుకోలేదట. మానసి తండ్రి స్నేహితుల్లో ఒకరు అమ్మాయిది మంచి హావభావాలు పలికే ముఖం. సినిమాల్లో ప్రయత్నం చేయండి అని సూచించారట.