2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా క్రింద పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 56 స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు. రెజ్లింగ్ (పురుషులు), బాస్కెట్ బాల్ (పురుషులు & మహిళలు), కబడ్డీ (మహిళలు), ఫుట్‌బాల్ (మహిళలు), బ్యాడ్మింటన్ (పురుషులు & మహిళలు), హాకీ (మహిళలు), క్రికెట్ (పురుషులు), వాలీబాల్ (పురుషులు).. క్రీడా విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత క్రీడా విభాగాల్లో ప్రతిభావంతులైన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కుల పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర ట్రేడుల్లుల్లో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల వయోపరిమితి నవంబర్ 02, 2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 2, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.