తన అందం, అభినయంతో సినిమాల్లో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది. పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు నడిపిందంటూ ఈ బ్యూటీపై రూమర్లు వినిపించాయి. ఇక టీమిండియా దిగ్గజ క్రికెటర్ తోనూ రిలేషన్ నడిపిందని ప్రచారం జరిగింది. ఇవి నిజమో, అబద్ధమో తెలియదు కానీ 50 ఏళ్లు వచ్చినప్పటికీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంది.
ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె గురించి అనేక రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అప్పట్లో ఆమె ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే టాక్ వినిపించింది. నగ్మా-సౌరవ్ గంగూలీల ప్రేమ సంబంధం గురించి ఇండస్ట్రీలో వార్తలు వినిపించేవి. అప్పటికే గంగూలీకి వివాహం జరిగింది.
ఆ తర్వాత నటుడు శరత్ కుమార్ తో ప్రేమలో పడిందనే టాక్ నడిచింది. కానీ అప్పటికే అతడికి వివాహం జరిగి పిల్లలు ఉన్నారు. వీరిద్దరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. అలాగే నటుడు రవి కిషన్ తోనూ నగ్మా ప్రేమలో ఉందనే రూమర్ అప్పట్లో ఫిల్మ్ వర్గాల్లో హల్చల్ చేసింది. అప్పటికే అతడు వివాహితుడు కావడంతో వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.

అయితే అప్పట్లో నగ్మా ప్రేమ కథలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నగ్మా.. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా గడిపేస్తుంది.