మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా నిర్ణయించబడింది. స్త్రీలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు. అంటే, సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో.. భార్యాభర్తల వయస్సులో మూడు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ చట్టబద్ధంగా అంగీకరించబడుతుంది. స్త్రీలు, పురుషుల కంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడే ఆ బంధం ఎక్కువకాలం ఉంటుందనేది సమాజమే చెబుతుంది. అయితే మన దేశంలో భార్యభర్తల మధ్య వయసు తేడా కనీసం 3-5 ఏళ్లు తప్పకుండా ఉండాలని భావిస్తుంటారు.
ముఖ్యంగా కుటుంబం కుదుర్చిన పెళ్లిల్లో వయసును కచ్చితంగా చూస్తుంటారు. కానీ, చాలా ప్రేమ పెళ్లిల్లో మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. భర్త కంటే భార్య పెద్దగా ఉన్నా.. చాలా మంది వైవాహిక జీవితాన్ని గడిపేస్తున్నారు. ఉదాహరణకు బాలీవుడ్ నటులు షాహీద్ కపూర్, మోడల్ మిరా రాజ్పుత్ మధ్య సుమారు 15ఏళ్ల తేడా ఉంటుంది. మరో నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నికో జోన్స్ వయసు కూడా సుమారు 10 ఏళ్లు తేడా ఉంటుందని తెలిపారు.

వీరందరూ సంప్రదాయ నిబంధనలను పాటించకపోయినా వివాహ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు. మన సమాజంలో పెళ్లి విషయంలో అనేక నిబంధనలు పాటిస్తుంటారు. కానీ ఈ విషయంలో సైన్స్ మాత్రం ఇద్దరికీ మెచ్యూరిటీ వచ్చాకే పెళ్లి చేయాలని సూచిస్తోంది. బాలుర కంటే బాలికలు త్వరగా మెచ్యూరిటీ అవుతారని సైన్స్ చెబుతోంది. బాలికల్లో 7-13 ఏళ్ల మధ్య హార్మోన్ మార్పులు జరగగా, బాలల్లో 9-15ఏళ్ల మధ్య జరుగుతుందని అంటోంది. ఫలితంగా పురుషల కంటే మహిళలు త్వరగా మానసికంగా వృద్ధి చెందుతారని వెల్లడిస్తోంది.
మన దేశంలో వివాహ లీగల్ ఏజ్ అమ్మాయిలకు 18 కాగా, అబ్బాయిలకు 21గా ఉంది. ఫలితంగా భార్యాభర్తల మధ్య కనీసం 3 ఏళ్ల వయసు తేడా కనిపిస్తుంది. ఈ వయసు దేశాల వారీగా మారుతూ ఉంటుంది. కానీ, సైన్స్ ఎక్కువగా శారీరక పరిపక్వత పైనే ఆధారపడుతుందని.. మానసికంగా కూడా మెచ్యూరిటీ సాధించాలని నిపుణులు అంటున్నారు. ఇద్దరిలోనూ శారీరక, మానసిక, భావోద్వేగ పరిపక్వత రావాలని.. అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, వివాహ జీవితంలో విజయం సాధించాలంటే కేవలం వయసు మాత్రమే ముఖ్యం కాదని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం, అర్థం చేసుకునే తత్వం ఉండాలని సలహా ఇస్తున్నారు. దంపతుల మధ్య మూడేళ్లు లేదా 15 సంవతర్సాల తేడా ఉన్నా సరే.. ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే కీలకమని అంటున్నారు. వీరిద్దరి వ్యవహార శైలి వల్ల వివాహ జీవితం ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.