కత్రినా.. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు. ‘ కొత్త ఆధ్యాయం ప్రారంభం కానుంది. మా జీవితంలో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నాం’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు విక్కీ-కత్రినా.
అయితే నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న నటి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు తమ తొలి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుభవార్త వెల్లడించారు. 42 ఏళ్ల కత్రినా బేబీ బంప్‌ను చూపిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో, ‘గర్భం ధరించడానికి సరైన వయసు’ గురించి ఆన్లైన్లో చర్చలు మొదలయ్యాయి.

కొందరు నెటిజన్లు ‘గర్భం ధరించడానికి అత్యంత ప్రమాదకరమైన వయసు’ గురించి తమ అభిప్రాయాలను రీల్స్, పోస్టుల ద్వారా పంచుకుంటున్నారు. కత్రినా కైఫ్ 42 ఏళ్ల వయసులో గర్భం ధరించడం చాలామందికి సంతోషం కలిగించినా, సోషల్ మీడియాలోని కొన్ని రీల్స్ ఈ వయసులో పిల్లలను కనడంపై చర్చకు దారితీశాయి. ఒక పోస్ట్ ప్రకారం, 41 నుంచి 45 ఏళ్ల మధ్య గర్భం ధరించడం చాలా కష్టమైన విషయం.
“సెలబ్రిటీలు దీనిని సులభంగా చూపిస్తారు కానీ అది నిజం కాదు. ఐవీఎఫ్ ఖర్చుతో కూడుకున్నది, ప్రమాదకరమైనది. ఈ వయసులో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది” అని ఆ పోస్ట్ పేర్కొంది. 30 ఏళ్ల వయసులో గర్భం ధరించడం సరైన సమయం అని చెప్పినప్పటికీ, ఆ వయసు నుంచి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని కూడా ఆ పోస్ట్‌లో వివరించారు.
అయితే, 26 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గర్భం ధరించడానికి “స్వీట్ స్పాట్”గా పరిగణించబడుతుందని, ఎందుకంటే ఆ సమయంలో సంతానోత్పత్తి బలంగా ఉంటుందని, చాలామంది జీవితంలో స్థిరమైన స్థితిలో ఉంటారని ఆ పోస్టులలో పేర్కొన్నారు.