భారత్ – పాక్ మ్యాచ్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ సూటిగా సమాధానాలు చెప్పాడు. ముఖ్యంగా ఓ పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు అతను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అయితే ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ వీడియోలో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కాళ్లను తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ, ఇది నిజం కాదు. ఈ వీడియోను కావాలని కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు ప్రచారం కోసం ఉపయోగిస్తున్నాయని స్పష్టమైంది.
టాస్ తర్వాత కెమెరా ముందు రవిశాస్త్రితో మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ కింద పడిన కాయిన్ను తీసుకోడానికి వంగాడు. ఈ సమయంలో సల్మాన్ అలీ ఆఘా అతని పక్కనే నిలబడి ఉన్నాడు. కెమెరా కోణం వల్ల సల్మాన్ అలీ ఆఘా పాదం, సూర్యకుమార్ వంగిన తీరు చూస్తే అతను కాళ్లు మొక్కినట్లుగా కనిపిస్తుంది.
కానీ దగ్గరగా చూస్తే సూర్యకుమార్ యాదవ్ పాదాలకు చాలా దూరంలో ఉన్న కాయిన్‌ను తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
Suryakumar Yadav decided not to shake hands with Salman Ali Agha and instead touched his feet? Great gesture by SKY pic.twitter.com/75aZMArX7B
— paty (@_midwicket) September 21, 2025