నిజానికి, మనీష్ హౌస్‌లో తన వంద శాతం కష్టాన్ని చూపించాడు. ప్రతి టాస్కులోనూ చురుగ్గా పాల్గొంటూ, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, కొత్తగా ఏదైనా చేయాలనే అతని ప్రయత్నాలు కొన్నిసార్లు వికటించాయి. ముఖ్యంగా, ఈ వారం భరణిని టార్గెట్ చేయడం, ఒక సీఐడీ ఆఫీసర్ లాగా వ్యవహరిస్తూ చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం ప్రేక్షకులకు నచ్చలేదు.
అందుకే ఓట్ల పరంగా అతను వెనుకబడ్డాడు. అయితే రెండో వారం నామినేషన్స్‌లో మర్యాద మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డిమోన్ పవన్, హరిత హరీశ్, ఫ్లోరా షైనీ, భరణిలు ఉన్నారు. చివరికి ఫ్లోరా, మనీష్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు ప్రేక్షకులను నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఫ్లోరా సేఫ్ అయింది. మనీశ్ బయటకు వచ్చేశాడు.
బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలో తాను స్టార్టఫ్ ఫౌండర్ అని చెప్పాడు మర్యాద మనీశ్. అంటే తనకు భారీగానే జీతం వస్తుందన్నమాట. మరి లక్షల సంపాదన ఉన్న మనీష్ మర్యాద బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా ఎంత సంపాదించాడనేది ఆసక్తికరంగా మారింది. అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను విజయవంతంగా అధిగమించి బిగ్ బాస్ కు వచ్చిన మనీశ్ వారానికి రూ. 60 నుంచి 70 వేల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
అంటే, ఈ లెక్కన రెండు వారాలు ఉన్న మనీష్ మర్యాద బిగ్ బాస్ 9 తెలుగు ద్వారా రూ. లక్షా 40 నుంచి లక్షా 50 వేల వరకు సంపాదించడని తెలుస్తోంది. కాగా గతం లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు మనీశ్. ఇప్పుడు బిగ్ బాస్ షోలోనూ సందడి చేసి బయటకు వచ్చాడు.