ఆదివారం మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారం లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో వీరికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. ఓటింగ్ సరళిని బట్టి కామనర్స్ ప్రియా శెట్టి, మనీష్ మర్యాద అలాగే నటి ఫ్లోరా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత సీజన్ మాదిరిగానే ఈసీజన్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి.
మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడానికి సిద్దంగా ఉన్నాడు. 3వ వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే మూడో వారం లేదా నాలుగో వారంలో ఏదో ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. అంటే మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లనున్నారన్నమాట. దీంతో రెండో దశలో మరో ఐదుగురిని హౌస్ లోకి తీసుకొచ్చే యోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.
కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీల నుంచి 4 గురు కంటెస్టెంట్లను, కామన్ మ్యాన్ కేటగిరిలో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి షోలోకి పంపేదుకు రెడీ అవుతున్నారని టాక్. సెలబ్రిటీల నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, సింగర్ శ్రీ తేజ, దివ్వెల మాధురి, జ్యోతి రాయ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిలో జ్యోతిరాయ్, సింగర్ శ్రీ తేజ తప్పితే మిగతా ఇద్దరూ వివాదాలతో వార్తల్లో నిలిచిన వారే.
అలాగే కామనర్స్ కోటాలో నాగ ప్రశాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే వీరి కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించి వారిని ప్రేక్షకు లకు, ఇంటి సభ్యులకు పరిచయం చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2.o 5 వారం ముగింపులో ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.