ధర్మవరపు ఆఖరి కోరిక నెరవేరలేదని నెట్టింట వైరల్గా మారింది. అభిమానులు, దర్శక నిర్మాతలు తేజకు మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో తేజ సినిమాల్లో కనిపిస్తే, ధర్మవరపు కోరిక నిజం కావడం ఆశాజనకంగా ఉంటుంది.ధర్మవరపు సుబ్రమణ్యం మేమందరం గుర్తు చేసుకోవాల్సిన స్టార్. అయితే ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు మా ఆయన చిన్నపిల్లాడిలా ఏడ్చేవారు.
తన పరిస్థితి ఇలా అయ్యిందేంటని మానసిక క్షోభ అనుభవించారు. ఆయనను చూసి మా గుండె తరుక్కుపోయేది. మా వారికి తన మనవళ్లను చూడాలనే కోరిక చాలా ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అలాగే తాను లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో తన పేరును నిలబెట్టాలని రెండవ అబ్బాయి తేజ దగ్గర మాట తీసుకున్నారు. పెద్దబ్బాయి సందీప్ వ్యాపార రంగంలో సెటిల్ అయ్యాడు.

తండ్రికి ఇచ్చిన మాట కోసం రెండవ అబ్బాయి రవి బ్రహ్మ తేజ కూడా ఉద్యోగం చేసి మానేసి తండ్రి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ నా బిడ్డకు అనుకున్నంత స్థాయిలో ఇంకా అవకాశాలు రాలేదు. నా భర్త లాగే నా కొడుకు తేజ కూడా మంచి కమెడియన్ లా పేరు తెచ్చుకోవాలని మేము కలలు కంటున్నాం’ అంటూ ఓ సందర్భంలో ఎమోషనలైంది ధర్మవరపు సుబ్రమణ్యం భార్య. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
ధర్మవరపు ఆఖరి కోరిక నెరవేరలేదని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. దర్శక నిర్మాతలు గొప్ప మనసుతో ధర్మవరపు కుమారుడికి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా రవి బ్రహ్మ తేజ సినిమాలు చేయాలని, తద్వారా ధర్మవరపు ఆఖరి కోరిన నెరవేరాలని మనమూ కోరుకుందాం.
