నాలుగు పదుల వయసులో, లేదా ఐదు పదుల వయసులో ప్రేమలో పడిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా లేటు వయసులో పడింది. అంతకన్నా ముందు.. 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి, 13 ఏళ్లు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే బాలీవుడ్ నటి , సింగర్ కునికా సదానంద్.
ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ 19లో పాల్గొంటుంది. ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటి.. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆమె ఇద్దరినీ పెళ్లి చేసుకుంది. మరో ఇద్దరితో ప్రేమలో పడింది. ఆమె లవ్ స్టోరీల గురించి తన కొడుకు షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేదుగానీ.. మా అమ్మకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అని చెప్పి షాక్ ఇచ్చారు.
ఇక కునికా 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి, 13 ఏళ్లు పెద్ద అయిన అభయ్ కోథారీని పెళ్లి చేసుకుంది. ఇది లవ్ మ్యారేజ్. వారికి ఒక కుమారుడు (సియామ్) జన్మించాడు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. మొదటి పెళ్లి విఫలమైన తర్వాత, కునికా 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆతర్వాత ఈ ఇద్దరు కూడా విడిపోయారు.
పెళ్లి బ్రేకప్ తర్వాత కునికా ప్రసిద్ధ యాక్టర్ ప్రాన్ కుమారుడు సునీల్ సికాంద్‌తో ప్రేమలో పడింది.. కానీ అది పెళ్లివరకు వెళ్ళలేదు. ఆతర్వాత 1990లలో, 1993లో ఊటీలో ఒక షూటింగ్ సమయంలో కునికా, కుమార్ సానుని కలిసింది.. ఆతర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.. కానీ వీరి రిలేషన్ కూడా ఎక్కువ కాలం సాగలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ 19లో పాల్గొన్న ఆమె గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.