పెళ్లి కోసం పుణ్యక్షేత్రాలు చుట్టేస్తున్న తెలుగు స్టార్ యాంకర్, ఆ యాంకర్ ఎక్కడుందో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖికి భక్తి భావం ఎక్కువ. అందుకే కాస్త తీరిక దొరికినా చాలు పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళుతుంటుంది. తాజాగా ఆమె తిరువణ్ణామలై వెళ్లింది. అయితే తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ పలువురి మెప్పు పొందింది శ్రీముఖి. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ దూసుకుపోతోంది. సరైన ఆఫర్స్ వస్తే వెండితెరపై రాణించాలని చూస్తోంది.

తన టాలెంట్ తో వచ్చిన ఫేమ్ శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తెగ హంగామా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది. ఇదంతా పర్లేదు కానీ శ్రీముఖికి పెళ్లి వయసు రావడంతో గత కొన్ని నెలలుగా శ్రీముఖి పెళ్లిపై బోలెడన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

గత నాలుగేళ్లుగా టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో శ్రీముఖి పీక్కల్లోతు ప్రేమలో ఉందని, ఈ ఇద్దరూ రహస్యం డేటింగ్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అయింది. కానీ నేటికీ శ్రీముఖి పెళ్లికి మాత్రం ఇప్పటికీ ముహూర్తం కుదరలేదు. ఈ పరిస్థితుల నడుమ తాజాగా అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళింది శ్రీముఖి. ఆమెను ఇలా పుణ్యక్షేత్రంలో చూసి.. త్వరలో పెళ్లి కావాలని కోరుకోవడానికే ఆమె ఇక్కడికి వచ్చిందనే టాక్ మొదలైంది.

ఈ సంవత్సరం అయినా శ్రీముఖికి పెళ్లి అయ్యేలా చూడు స్వామి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి గ్లామర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వయసు పెరుగుతుంటే ఈ అమ్మడు తన నాజుకైన అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. సోషల్ మీడియాలో శ్రీముఖి హంగామా కంటిన్యూ అవుతోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *