ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రస్తుతం శర్వానంద్, రక్షిత రెడ్డి దూరంగా ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు ఉంటున్నారట. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తెలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరికీ విడాకుల ఆలోచన లేదని తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోండి.
అయితే గతేడాది శర్వా – రక్షితకు ఒక పాప కూడా పుట్టింది. ఆమె పేరు లీలా దేవి. ఇక ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట జీవితంలో కలతలు రేగాయని తెలుస్తోంది. అవి చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయేంతవరకు వచ్చాయి. అయితే ఇక్కడే శర్వా కొత్తగా ఆలోచించాడు. విభేదాల వలన కలిసి ఉండలేకపోతున్నాం కాబట్టి..

విడాకులు లేకుండా సపరేట్ అవుదామని అనుకున్నారట. అలా ఎవరి ఇళ్లల్లో వాళ్లు విడివిడిగా ఉండడం మొదలుపెట్టారని అంటున్నారు. ఇక లీలా దేవిని కూడా ఇద్దరు పంచుకున్నారట. చిన్నారి కొన్నిరోజులు తల్లి దగ్గర.. కొన్నిరోజులు తండ్రి దగ్గర ఉంటుందట. ఒకవేళ ఈ సపరేషన్ లో కలతలు తొలగి కలవొచ్చు.
లేదు అంటే అప్పుడు విడాకులకు అప్లై చేస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉదయం నుంచి ఈ వార్తలు వస్తున్నా.. శర్వా వీటినేమి పట్టించుకోకుండా తన ప్రొడక్షన్ హౌస్ ఓమీని ప్రమోట్ చేయడంలో బిజీగా మారాడు. మరి ఈ విడాకుల వార్తలపై శర్వా స్పందిస్తాడేమో చూడాలి.