షూటింగ్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం. ఇప్పుడెలా ఉందొ తెలుసా.?

divyaamedia@gmail.com
1 Min Read

తారక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన టీమ్ వర్గాలు “చిన్న గాయమే” అని చెబుతూ, వెంటనే ప్రథమ చికిత్స అందించారని తెలిపాయి. గాయం శరీరంలో ఏ భాగంలో అయిందనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే హైదరాబాద్​లో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్​లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. వెంటనే మెడికల్ టీమ్‌ ప్రాథమిక చికిత్స అందించింది.

స్వల్ప గాయమే కావడంతో ఎన్టీఆర్‌ ఆరోగ్యం సవ్యంగా ఉందని టీమ్‌ తెలిపింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తారక్ త్వరగా కోరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం.

“జూనియర్ ఎన్టీఆర్‌ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. వైద్యుల సలహా మేరకు, పూర్తిగా కోలుకోవడానికి ఆయన వచ్చే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అభిమానులు, మీడియా, ప్రజలు ఎటువంటి ఊహాగానాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము” అని ఎన్టీఆర్ టీం ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో తలపడి ఫ్యాన్స్‌కు వినోదాన్ని అందించాడు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ సినిమా కోసం తారక్ కసరత్తులు చేస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల జిమ్‌లో ఆయన చెమటలు చిందిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజా గాయంతో ఈ సినిమా షూటింగ్ కాస్త లేటుగా ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *