వృద్ధాప్యం అన్నది ఆపినా ఆగదు. వయసు మీద పడుతుంటే ఆ ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కానీ, నాగార్జున విషయంలో అది కనిపించదు. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్లు వయసుతో సంబంధం లేకుండా అందంగా, ఫిట్‌గా కనిపిస్తారు. ఈ లిస్టులో ముందుండే హీరో నాగార్జున. ఈ టాలీవుడ్ కింగ్ 66 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఈ సీనియర్ హీరో ఏజ్ రివర్స్ చేసుకుంటున్నాడా అనిపిస్తుంది.
అయితే తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి నాగ్ చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ముఖ్యంగా రాత్రి పూట భోజనం చేసే సమయాన్ని మార్చుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందని తెలిపాడు. దీని గురించి డాక్టర్లు సైతం వివరించారు. రాత్రి 7 గంటల లోపు డిన్నర్ చేస్తానని నాగార్జున చెప్పాడు. ఈ అలవాటే తనను ఫిట్‌గా, యంగ్‌గా ఉంచుతుందన్నాడు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ కూడా నాగార్జున చెప్పిన పద్ధతి సరైనదే అంటున్నారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత శరీరంలోని డైజేషన్‌కు సంబంధించిన హార్మోన్లు నెమ్మదిగా పని చేస్తాయి. ఈ టైమ్‌లో లేట్‌గా తింటే శరీరం ఫుడ్ ప్రాసెస్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి మొత్తం మెటబాలిజం దెబ్బతింటుంది. చివరికి అది కొవ్వుగా బాడీలో పేరుకుకపోతుంది. డాక్టర్ పాల్ మాటలు వాస్తవమేనని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక స్టడీ ప్రకారం.. రాత్రి 9 గంటలకు తిన్నవారితో పోలిస్తే 6 గంటలకు తిన్నవారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని తేలింది. తిడే ఫుడ్, క్యాలరీలు ఒకేలా ఉన్నా, సమయం మార్చడం వల్ల ఫలితం మారిందని పరిశోధకులు వెల్లడించారు. లేట్ డిన్నర్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ రాత్రంతా, తర్వాతి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
త్వరగా డిన్నర్ చేస్తే మెటబాలిజం మెరుగుపడుతుందని, నిద్ర కూడా బాగా పడుతుందని స్టడీలో తేలింది. కేవలం డిన్నర్ టైమ్ మాత్రమే కాదు.. నాగార్జున ఫిట్‌నెస్‌కు స్పెషల్ లైఫ్‌స్టైల్ కూడా కారణం. తన రోజును ఎక్సర్‌సైజ్‌తో మొదలుపెడతానని కింగ్ చెప్పాడు. ఇతర పనులన్నింటినీ పక్కన పెట్టి మరీ వ్యాయామానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడు.
వారానికి ఐదు నుంచి ఆరు రోజులు.. రోజుకు 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో, స్విమ్మింగ్ చేస్తాడు. ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. బ్రేక్స్ లేకుండా, డిస్ట్రక్షన్ లేకుండా ఫకస్డ్‌గా వర్కౌట్స్ చేస్తాడు.