ఈ వ్యక్తి గురించి తెలిస్తే చెప్పండి, రూ.1 లక్ష ఇస్తాను, మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.

divyaamedia@gmail.com
2 Min Read

తాజాగా మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు రాఘవ లారెన్స్. చెన్నై లోకల్‌ ట్రైన్స్‌లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు చాలా కాలంగా స్వీట్స్ విక్రయిస్తున్నారు. ఆయనకు సంబందించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అలాగే అనాథ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. రైతులకు ట్రాక్టర్లు అందజేస్తున్నాడు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నాడు.

ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చి ఆమె కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు లారెన్స్. చెన్నైలో లోకల్ ట్రైన్స్ లో దాదాపు శ్రీ రాఘవేంద్ర అనే 80 ఏళ్ల వృద్ధుడు మిఠాయిలు విక్రయించడం ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన భార్య చేసిన స్వీట్లను ట్రైన్స్ లో అమ్మి పొట్ట నింపుకొంటున్నాడు.

ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఒక యూజర్.. ‘ ఆస్తి, ఆదాయం లేకుండా, పెన్షన్ లేకుండా 80 ఏళ్ల వయసులో కూడా కష్టపడి జీవిస్తున్నారు. ఆయన స్వీట్స్ ప్యూర్, డివైన్, లవ్‌తో నిండినవి. వారిని చూస్తే కేవలం కొనకండి, వారి ధైర్యాన్ని కొనండి’ అని రాశాడు. ఈ పోస్ట్ లక్షలాది మందిని కదిలించింది. వృద్దుడి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. పలు మీడియా న్యూస్ ఛానెన్స్ లోనూ ఆ వృద్ధుడి గురించి ప్రత్యేక కథనాలు ప్రసారమమయ్యాయి.

చివరకు ఆ వృద్ధుడి ఫొటోలు, వీడియోలు నటుడు లారెన్స్ దాకా కూడా వెళ్లాయి. దీంతో అతను చలించిపోయాడు. అతనికి ఎలాగైనా సాయం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నాకు చేరింది. చెన్నైలో 80 ఏళ్ల మనిషి, అతని భార్య స్వీట్స్, పోలీలు (స్వీట్స్) తయారు చేసి ట్రైన్‌లలో అమ్ముతూ జీవిస్తున్నారు. వారి ధైర్యం నన్ను బాగా కదిలించింది.

వారి జీవితానికి సపోర్ట్‌గా రూ. 1,00,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ సహాయం వారికి సౌకర్యం, బలం ఇస్తుందని ఆశిస్తున్నాను. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఎవరైనా వారి డీటెయిల్స్ తెలిస్తే నాకు చెప్పండి. మీరు కూడా ట్రైన్‌లో వారిని చూస్తే వారి స్వీట్స్ కొని సపోర్ట్ చేయండి’ అని ఎక్స్ లో రాసుకొచ్చాడు లారెన్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా బాగా వైరలవుతోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *