ప్రస్తుతం హీరోయిన్లు కూడా తమ బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి పలుకుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా తాను మెచ్చిన అబ్బాయిని తొమ్మిదేళ్లు ప్రేమించి, ఇప్పుడు సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ ఐదు రోజుల పెళ్లి, పది రోజుల పెళ్లి అంటూ అంటూ నానా హంగామా చేస్తున్నారు.
ఇక విందులు, వినోదాలకు కూడా భారీగా డబ్బు వెచ్చిస్తుంటారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్ల విషయంలో ఈ హంగులు, ఆర్భాటం ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఒక ప్రముఖ హీరోయిన్ ఇవేవీ లేకుండానే సింపుల్ గా పెళ్లి చేసుకుంది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సీక్రెట్ గా పెళ్లిపీటలెక్కి అందరికీ షాక్ ఇచ్చింది. వివాహ వేడుక అనంతరం సోషల్ మీడియాలో స్వయంగా తనే పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది.
ఇందులోనూ ఎంతో గోప్యత పాటించిందీ అందాల తార. కనీసం భర్త ఎవరన్నది తెలియకుండా ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా తీసుకున్న ఫొటోలను మాత్రమే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన వాళ్లందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇలా సీక్రెట్ పెళ్లితో వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ గ్రేస్ ఆంటోని. తెలుగు ఆడియెన్స్ కు ఈ అందాల తార పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఓటీటీలో మలయాళ సినిమాలు చూసే వారికి ఈ బ్యూటీ చాలా పరిచయం. కుంబళంగి నైట్స్, నునక్కుళి, పరంతు పో, రోర్చా తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార.
సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సడన్గా తను పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసింది. అయితే భర్త ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. మరి రాబోయే రోజుల్లోనైనా తన జీవిత భాగస్వామి గురించి చెబుతుందేమో చూడాలి.