Apollo: పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో 10 ఎకరాల్లో అపోలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్న రామ్ చరణ్ దంపతులు.

divyaamedia@gmail.com
2 Min Read

Apollo: పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో 10 ఎకరాల్లో అపోలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్న రామ్ చరణ్ దంపతులు.

Apollo: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పైన ఫోకస్ చేశారు. ఇక రానున్న వినాయక చవితి పండుగకు పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా మట్టి వినాయకులనే పూజించాలని పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి తాజాగా మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పుణ్యాన ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మార్మోగిపోతోంది. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు జనసేన అధ్యక్షులు.

Also Read: నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది, కావాలంటే మీరు ట్రే చెయ్యొచ్చు.

ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన నిర్వహించారు. ఇదిలా ఉంటే పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్- ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.

ఆస్పత్రి నిర్మాణంతో పాటు మిగిలిన ప్లేస్ లో ఉద్యానవనం ఏర్పాటు చేయాలని రామ్ చరణ్- ఉపాసన దంపతులు భావిస్తున్నారట. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారట. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు. పిఠాపుర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పది ఎకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు. ఆ ప్లేస్‌ ను ఉపాసనకు అప్పగించారని ఆయన తెలిపారు. ఈ 10 ఎకరాల్లో అపోలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టించనున్నారని అన్నారు.

Also Read: మీరు పడుకునే స్థితిని బట్టి మీరు ఎలాంటివారో తెలుస్తుంది.

త్వరలోనే శంకుస్థాపన ప్రారంభించనున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పిఠాపురం వాసులు ఈ వార్తను విని తెగ ఆనందపడిపోతున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి. తద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరగనుంది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *