వేలంలో గణేశుడి లడ్డు గెల్చుకున్న కుమారీ ఆంటీ..! లడ్డు ఎంతో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

వేలం ఎంతయినా సరే, ఆ గణపయ్య లడ్డూను దక్కించుకోవాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది. ఇక ఈసారి ఈ లడ్డూ వేలంలో సోషల్ మీడియా సంచలనం, ఫేమస్ ఇంటర్నెట్ సెలబ్రిటీ కుమారీ ఆంటీ కూడా పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే మా నగర్ గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా జరిగిన లడ్డూ వేలంలో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. అందరితో పోటీపడి మరీ లడ్డూను గెలుచుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా గణేశుడి లడ్డూకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఒక వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అందులో ఇలా చెప్పుకొచ్చింది.. ‘హలో.. అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కుమారి ఆంటీని. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. నిజంగా గణేశుడు నాకింత ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది.

వినాయకుల వారి లడ్డూను నేను దక్కించుకున్నాను. చాలా ఏళ్ల నుంచి నేను ఇది కోరుకుంటున్నాను. వేలంలో గణేశుడి లడ్డూ దక్కించుకుని, ఇంటికి తెచ్చుకుని, అందరికీ పంచాలని చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నాను. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. నేను హోటల్ పెట్టి సుమారు 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది వినాయకుడి ప్రసాదం ఇస్తూనే ఉన్నాను. ఇలా ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు. అదే సమయంలో నీ లడ్డూ ఎప్పుడిస్తావు నాయనా?

అని గణేశుడిని వేడుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు 15 సంవత్సరాలకు నా కల నెరవేరింది. స్వామి వారికి నేను ప్రసాదం ఇవ్వడమే కాదు ఇప్పుడు నాకు ఆ అదృష్టాన్ని కల్పించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై గణేశా.. జై జై గణేశా ‘ అంటూ ముగించింది కుమారీ ఆంటీ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *