జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం, గోల్డ్ రేట్స్ పై మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ.

divyaamedia@gmail.com
2 Min Read

మహిళల కోసం సరికొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త పథకంతో చాలా మంది మహిళలకు భారీ ఊరట కలుగనుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల మహిళలకు సులభంగా రుణాలు అందేలా ఈ కొత్త పథకం ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే ఇప్పటికే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష రూపాయల మార్క్ దాటేసి సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా, పసిడి ఆభరణాలపై అధిక ధరల కారణంగా మహిళలు కొనుగోళ్లు తగ్గించారు.

పెళ్లిళ్లు, పండుగలు దగ్గరపడుతున్న సమయంలో బంగారం ధరల పెరుగుదల మధ్యలో వచ్చిన ఈ జీఎస్టీ కోత మహిళలకు నిజంగా వరంలాంటి నిర్ణయమని చెప్పవచ్చు. బంగారంపై జీఎస్టీ రేటు తగ్గించడంతో ఆభరణాల ధరలో కొంత ఊరట లభించింది. ఉదాహరణకు 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసే సమయంలో ముందుకంటే ఇప్పుడు వందల రూపాయల మేర తక్కువ ఖర్చు అవుతోంది. చిన్న స్థాయి అయినా ఈ ఉపశమనం పండుగల సమయంలో కొనుగోలు దారుల ఉత్సాహాన్ని పెంచనుంది.

జీఎస్టీ రేటు తగ్గింపు తర్వాత, బంగారం ధరలో పెద్ద తగ్గుదల కనిపించింది. ఉదయం 10.19 గంటలకు 10 గ్రాముల బంగారం ధర రూ.1239 తగ్గింది. ఉదయం 10 గంటలకు బంగారం ధర 10 గ్రాములకు రూ.105,956 వద్ద కొనసాగుతోంది. ఇప్పటివరకు బంగారం ధర రూ.105,800 కనిష్ట రికార్డును, రూ.106,774 గరిష్ఠ రికార్డును నమోదు చేసింది. బంగారం ధర 10 గ్రాములకు రూ.107,195 వద్ద ముగిసింది. వెండి ధర 10 గ్రాములకు రూ.523 తగ్గింది.

ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వెండి ధర రూ.122945గా నమోదైంది. వెండి ఇప్పటివరకు రూ.122,193 కనిష్ట రికార్డును, రూ.122,945 గరిష్ఠ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు అధికంగా ఉండటం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు నియంత్రణలో లేకుండా పోయాయి. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆభరణాల మార్కెట్‌లో కొంత సానుకూల వాతావరణం నెలకొన్నది.

ముఖ్యంగా, మధ్యతరగతి కుటుంబాలు దీన్ని శుభవార్తగా భావిస్తున్నాయి. మొత్తంగా బంగారం ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సామాన్య కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు ఉపశమనం కలిగించేలా మారింది. రాబోయే పండుగ సీజన్‌లో ఈ మార్పు వినియోగదారుల కొనుగోళ్లపై మంచి ప్రభావం చూపనుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *