గణేశ్ నిమజ్జనంలో న‌డిరోడ్డుపై టాలీవుడ్ హీరోయిన్ తీన్మార్ స్టెప్పులు అదుర్స్‌! వైరల్ వీడియో.

divyaamedia@gmail.com
2 Min Read

హైదరాబాద్‌లో లడ్డూ గణేశ్, ఖైరతాబాద్ గణేశ్, బలాపూర్ గణేశ్ వంటి ప్రసిద్ధ విగ్రహాల నిమజ్జన సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు తరచుగా దర్శనమిస్తారు. అయితే తాజాగా ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ త‌మ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించిన గణేషుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొంది. ఈ క్ర‌మంలోనే న‌డిరోడ్డుపై స్థానికులు, స్నేహితుల‌తో క‌లిసి శ్ర‌ద్ధా ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే చవితి రోజు నుంచి ఘనంగా పూజలందుకున్న గణ నాథులు క్రమంగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఎంత వైభవంగా జరిగిందో.. గణేష్ నిమజ్జనం కూడా అంతే వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్కులవారు ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ గణేశుడికి వీడ్కోలుచెపుతున్నారు. కాగా ఈ గణేశ్ నిమజ్జనోత్సవంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. సామాన్య జనాల్లో కలిసి పోయి ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా గణేష్ నిమజ్జన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది.

తన అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించిన గణేషుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న ఆమె స్థానికులతో కలిసి తీన్మార్ స్టెప్పులేసింది. వర్షం పడుతున్నా పట్టించుకోకుండా ఉత్సాహంగా డ్యాన్స్ లు చేస్తూ సందడి చేసింది. అంతేకాదు స్వయంగా డ్రమ్స్ వాయించి అందరిలో పండగ ఉత్సాహాన్ని నింపింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రద్ధాదాస్ నే స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేసింది. నిమజ్జన ఉత్సవాలలో ఇదే బెస్ట్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శ్రద్ధాదాస్.

మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో ఈ బ్యూటీ అందానికి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే ప్రభాస్ నటించిన డార్లింగ్ లోనూ సెకెండ్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో బోల్డ్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరపై బిజి బిజీగా ఉంటోంది. పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. అలాగే కొన్ని వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది. రెగ్యులర్ గా సినిమాల్లో కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధాదాస్.

తను షేర్ చేసే ఫొటోలు,వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *