అదిత్ అరుణ్ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. హీరోగా, కీలక పాత్రల్లో సినిమాలు చేస్తున్నాడు. 2023 లో అదిత్ అరుణ్ నివేదితా అనే అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడీ హ్యాండ్సమ్ హీరో ఒక శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ కొండా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్.
చెన్నైకు చెందిన త్రిగుణ్ 2023 సెప్టెంబర్లో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారీ దంపతులు.
దీని కంటే ముందు నివేదిత సీమంతం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను త్రిగుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.