కోచింగ్ తీసుకోకుండానే మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ క్రాక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఐపీఎస్ సిమల ప్రసాద్ అక్టోబర్ 1980లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. ఆమె తల్లి, మెహ్రున్నీసా పర్వేజ్ భారతీయ సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. ఆమెను 2005లో పద్మశ్రీ అవార్డు వరించింది. తండ్రి భగీరథ్ ప్రసాద్ IAS అధికారి. ఐపిఎస్ అధికారిగా తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన సిమల ప్రసాద్ కళపై తనకున్న ఆసక్తి గురించి తల్లికి వివరించింది. అయితే కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

అయితే నటనను కొనసాగిస్తూనే ఉన్నత చదువులు అభ్యసించింది. ప్రముఖ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్త చేసింది. ఆ తర్వాత స్టేట్ పబ్లిక్ కమిషన్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. అలా DSP గా పోస్టింగ్ కూడా వచ్చింది. కానీ అంతకు మించి ఏదో సాధించాలన్న తపన ఆమెలో ఉంది. అందుకే అక్కడితో ఆగిపోలేదు యూపీఎస్సీ పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యింది. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ ను క్రాక్ చేసింది.

తెలుగు ప్రేక్షకులకు సిమల ప్రసాద్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ఆడియెన్స్ కు ఈ నటి బాగా పరిచయం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ బి.కామ్ చదువుతున్నప్పుడే పలు నాటకాల్లో నటించింది. ఇదే క్రమంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2017లో ‘అలీఫ్’ , 2019లో విడుదలైన ‘నకాష్’ చిత్రాల్లో సిమల ప్రధాన పాత్రలు పోషించింది. అయితే సినిమాల్లో నటిస్తూనే భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారామె.

ఆ తర్వాత పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు.మొదట మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు విమల ప్రసాద్. అయితే డీఎస్పీ పోస్ట్ వచ్చినా తన కలల ప్రయాణాన్ని ఆపలేదు. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమైంది. తొలిప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్‌ లేకుండానే పరీక్షలో విజయం సాధించింది. ఐపిఎస్ అధికారిణి గా బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుతం ఆమె రైల్వే ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *