Varalakshmi Vratham: మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నారా..! ఈ విషయాలు మీకోసమే.
Varalakshmi Vratham: శ్రావణ మాసం, శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైంది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. అయితే పౌర్ణమి కి ముందు వచ్చే ఆ రోజున వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహిస్తుటారు. వరలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల కోరిన వరాలు తీరతాయని నమ్మకం. అయితే ఆ రోజున ఇంట్లోనే వరలక్ష్మి పూజలు ఎలా నిర్వహించుకోవాలనే సందేహాలు ఉంటాయి.
Also Read: ఈ ఆలయంలో చీపురు సమర్పిస్తే చాలు, ఆ రోగాలు వెంటనే తగ్గిపోతాయి.
అలాంటి సందేహాలపై గోదావరి ఖని ఆలయ పూజారి వెంకటేశ్వర్లు వివరించారు. వరలక్ష్మి వ్రతం రోజూ ఇలా పూజ చేయాలి.. వరలక్ష్మి రోజున ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేసుకుని, స్నానం చేసుకున్నాక ఇంట్లో ఉన్న దేవుళ్ళ వద్ద మనస్పూర్తిగా చేతులు నమస్కరించి ఈ రోజు కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రార్థించుకోవాలి. పూజకి సంబంధించిన సామాగ్రి , పంచామృతాలు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, అలాగే పసుపు కుంకుమ, గంధము, పువ్వులు, దారము, 3 కిలోల బియ్యము, కలశం, రాగి చెంబు, మంగళ హారతి, నైవేద్యము, వీటితో పాటు మన కుటుంబ సభ్యులకి ఇచ్చే వాయినాలు సిద్ధంగా పెట్టుకోవాలి.
పూజ ప్రారంభానికి ముందు పసుపుతో తయారు చేసిన గణపతి తయారు చేసుకుని, ముందుగా కలశ గణపతికి పూజ చేయాలి. అనంతరం వరలక్ష్మి పూజ ప్రారంభం చేయాలి. తాంబూలంలో బియ్యం పోసుకుని అందులో పసుపుతో తయారు చేసిన గణపతిని ఉంచి, కలశం లోపల బియ్యం నింపుకుని, ఆ కలశంలో మర్రి చిగురు వేయాలి లేదా మామిడి ఆకులు వేయాలి. ముత్తైదువులకు వాయనం… వరలక్ష్మి పూజ అనంతరం 9 మందికి కంకణాలు కట్టి , ఆ 9 మందికి అంటే మీతో, అమ్మవారితో కలిపి 9 మంది ముత్తైదు మహిళలకు వాయనం ఇవ్వాలి.
Also Read: అరచేతిలో దురదగా ఉంటే, మీకు నిజంగానే డబ్బు వస్తుందా..?
ఆ వాయనంలో తమలపాకు, జాకెట్ ముక్క, శనగలు కలిపి వాయనంగా ఇవ్వాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఉంచి, లక్ష్మి శోదొపచరాలతో అమ్మవారికి పూజ నిర్వహించాలి. అనంతరం ఆ రోజంతా అమ్మవారిని తలుచుకుంటూ వ్రతమును చదువుకోవాలి. ఇలా పూజ నిర్వహించినట్లయితే వాటికి అష్టైశ్వార్యాలు, సౌభాగ్యంను అమ్మవారు ప్రసాదిస్తుందని అర్చకులు వెంకటేశ్వర్లు తెలిపారు.