పాలిటిక్స్‌లో పెద్ద పదవులు అనుభవించిన తర్వాత కూడా తిరిగి యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు చాలా తక్కువ మంది కనిపిస్తారు. వీరిలో ప్రముఖ బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. ఆమె ఇండియన్ టెలివిజన్, పాలిటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ల్లీలో ఒక పంజాబీ-బెంగాలీ కుటుంబంలో జన్మించింది స్మృతి ఇరానీ.
మరియు రాజకీయాల్లోకి రాకముందు టెలివిజన్ రంగంలో విజయవంతమైన వృత్తిని కలిగి ఉంది, ముఖ్యంగా “క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ” సీరియల్‌లో తులసి విరాణీ పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందింది. ఆమె గతంలో మోడలింగ్ చేసింది, టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా పనిచేసింది. కాగా జీవితంలో స్మృతి ఇరానీ ఎన్నో కష్టాలను చూసింది. చిన్న చిన్న పనులు చేసి ఆమె తన కుటుంబాన్ని పోషించింది.
మొదట్లో కాస్మొటిక్స్ అమ్మింది. ఆ పనికి రూ. 200 జీతం అందుకుందట.. ఆతర్వాత 20 ఏళ్ల వయసులో భారతదేశంలోని మొట్టమొదటి మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లో పని చేరింది. అక్కడ గిన్నెలు కడిగే పని చేసిందట. ఆతర్వాత ఆమె సినిమా రంగం వైపు అడుగులేసింది. పలు ఆడిషన్స్ ఇచ్చింది. కొన్ని మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆతర్వాత సీరియల్స్ వైపు అడుగులేసింది. సీరియల్ లో స్టార్ గా ఎదిగింది స్మృతి ఇరానీ.
రామాయణం అనే టీవీ సీరియల్‌లో సీతగా కూడా నటించింది. ఇక సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న ఆమె రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. 2003లో బీజేపీలో జాయిన్ అయ్యారు. మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ ఇప్పుడు తిరిగి సీరియల్స్ లో నటిస్తున్నారు.