తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నిటంచారు.దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజ్. హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, సహాయ నటుడిగా రాణిస్తున్నారు. aite సత్యరాజ్ అంటే కొంత మందికి ఎవరతను అని ఆలోచన రావొచ్చు. అదే కట్టప్ప అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు.
ఇక తనదైన నటనతో ఇటు తెలుగు, అటు తమిళం తో పాటు పలు భాషల్లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సత్యరాజ్ గతంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు అన్న సంగతి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇక సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవ్వరికి తెలీదు. సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. ఇక కట్టప్ప దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కొడుకు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అతడి పేరు సిబిరాజ్.. డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే తన కూతురు దివ్య సత్యరాజ్ గురించి అభిమానులకు పెద్దగా తెలీదు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బయట తిరిగింది లేదు. ఇక దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం దివ్య సత్యరాజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ లా ఉన్నారు సినిమాల్లోకి రావొచ్చు కదండి.. అని కొందరు అంటే.. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం మీది అంటూ మరికొందరు కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. మరి హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉన్న సత్యరాజ్ కూతురుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.