ఒకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న ఈమె.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటుంది. అయితే అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమాను నిర్మించడంతో పాటు అందులోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల ఇతర విషయాల్లోనూ సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే ఇద్దరు కలిసి డిన్నర్ చేసిన తర్వాత ఓకే కారులో వెళ్లడం, ఆ ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ జంట డేటింగ్ వ్యవహారంపై మరోసారి రూమర్లు వచ్చాయి.

అంతకు ముందు లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే తమ డేటింగ్, రిలేషన్ విషయాలపై అటు సామ్ కానీ ఇటు రాజ్ కానీ నోరు విప్పడం లేదు. తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫొటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చిల్ అవుతూ కనిపించింది సామ్.
అయితే ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు సామ్ చేతికి ఈ రింగ్ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి రింగ్ తో కనిపించడంతో నెటిజన్లు భిన్న రకాలుగా అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ రూమర్లపై సామ్ కానీ, రాజ్ కానీ స్పందించడం లేదు. కానీ రాజ్ భార్య మాత్రం తరచూ ఏవో క్రిప్టిక్ పోస్టులు షేర్ చేస్తోంది.