శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి. అయితే ప్రముఖ నటి సిరి హనుమంతు గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మొదట న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించింది.
ప్రముఖ న్యూస్ ఛానెల్స్ లో పనిచేసింది. ఆ తర్వాత బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎవరే నువ్వు మోహిని, సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఇక సిరి హన్మంతు కెరీర్ కు బిగ్ బాస్ షో మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ షో ద్వారానెగెటివిటీ తెచ్చుకున్నప్పటికీ బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు పెరిగాయి.
ఇద్దరి లోకం ఒకటే, నరసింహపురం, ఓరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలోనూ ఓ క్యామియో రోల్ లో కనిపించింది. వీటితో పాటు పులి మేక వంటి వెబ్ సిరీస్‌లతోనూ ఫుల్ పాపులర్ అయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు తన రిలేషన్ షిప్ విషయంతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది సిరి.
ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ తో ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉందీ అందాల తార. వీరిద్దరూ ఓ బాబును దత్తత కూడా తీసుకుని పెంచుకుంటున్నారు.సిరి-శ్రీహాన్ రిలేషన్, పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. తమకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తున్నారు.
తాజాగా సిరి హనుమంతు శ్రీహాన్‌తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా సిరి చీరలో అందంగా ముస్తాబు కాగా, శ్రీహాన్ పంచెకట్టులో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.