జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్, యశోద.. తదితర చిత్రాలు చూసినవారికి ఈమె ఎవరో గుర్తొస్తుంది. ఈ సినిమాల్లో కనిపించి నటనతో మెప్పించింది. అయితే తాజాగా కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని.. ఆమె వల్ల కుటుంబసభ్యులకు, ప్రజలకు ప్రమాదముందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపారు.
కల్పిక రెండేళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. అందుకే ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో తెలిపారు. తన కూతురు చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని వెల్లడించారు. తన కూతురిని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది.