మూడు రోజులుగా ఆస్పత్రిలోనే నటి రాధిక, వైద్యులు ఏం చెప్పారో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

రాధికా శరత్ కుమార్.. జులై 28న ఆమెను చెన్నైలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యులు రాధిక కు ట్రీట్ మెంట్ అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యిందట.

అయితే ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న రాధికను కుటుంబ సభ్యులు గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాధికకు డెంగ్యూ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం రాధిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నాయి. అయితే, ఈ నెల 5 వరకు రాధికకు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాతే ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. అభిమానులు, సహచరులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *