కోవిడ్ సమయంలో వేలాది మందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్, ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అయితే చాలా చోట్ల సోనూసూద్ అభిమానులు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ తన పుట్టిన రోజున మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు.
పండుటాకుల కోసం ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇందులో సుమారు 500 మంది వృద్దులకు ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపాడు. అనాథలైన వృద్ధులకు ప్రేమతో కూడిన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు సోనూసూద్.
వృద్ధులకు ఆశ్రయం, వైద్య సదుపాయాలు, పోషకాహారం తదితర సదుపాయాలు కల్పించేలా ఈ వృద్ధాశ్రమాన్నిఏర్పాటు చేస్తున్నట్లు ఈ రియల్ హీరో తెలిపాడు. మరీ ముఖ్యంగా మలివయసులో వారికి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ కూడా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో ఈ రియల్ హీరోపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నాడు. అయితే వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటుచేస్తాడన్నది సోనూసూద్ తెలుపలేదు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఓ వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు సోనూసూద్ గతంలో ఓ సందర్భంలో వెల్లడించాడు.
#HappyBirthdy Real hero @SonuSood sir
— 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) July 30, 2025
Wishing the people's humanitarian, #SonuSood a very happy birthday sir ❤️
🎉🥳🎂
From #Telangana ❤️#HBDSonuSood @sonusood_india @apparalaHarish pic.twitter.com/KkvJ8wnWT8