సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి అని చెప్పాలి. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి సినిమాల్లో సౌందర్యకు ఎస్వీ కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. అయితే అమ్మోరు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం రా ఇలాంటి ఎన్నో సినిమాలలో తనదైన ఫ్యామిలీ నటనతో.. నాచురల్ సూపర్ స్టార్ గా.. ఎదిగింది హీరోయిన్ సౌందర్య.
అప్పట్లో సౌందర్యకు ప్రత్యేక అభిమానులు ఉండేవారు. సౌత్ మొత్తం తనదైన ముద్ర వేసుకున్న ఈ హీరోయిన్ నార్త్ లో కూడా ఎన్నో సినిమాలలో నటించింది. చిన్న వయసులోనే స్టార్స్ స్టేటస్ అందుకొని.. తనకంటూ సినిమా ఇండస్ట్రీలో..ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే.. కొద్దిగా అవకాశాలు తగ్గినప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో భాగంగా.. ఆమె ఒక ప్రచార కార్యక్రమానికి హెలికాఫ్టర్ లో వెళ్ళగా..

అది కాస్త ప్రమాదానికి గురై.. ఆమె మూడు పదుల వయసుల్లో ఉన్నప్పుడు ప్రాణం కోల్పోయింది. అన్నిటికన్నా విషాదమైన విషయం ఏమిటి అంటే.. ఆమె చనిపోయినప్పుడు ప్రెగ్నెంట్ కూడా అని తెలియడం. కాగా.. సౌందర్య మరణం గురించి మరో వార్త కూడా ఎక్కువగా వినిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ అది ఏమిటి అంటే.. సౌందర్య మరణం గురించి ఆమె తండ్రికి ముందే తెలుసు అంట. ఆమె జాతకం చూపియగా ఆమె.. మూడు పదుల వయసులో మరణిస్తుంది అని చెప్పారంట. కానీ ఆమె తండ్రి మాత్రం ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం ఆ తర్వాత ఆయన చెప్పి ఎంతగానో బాధపడ్డారు.