బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ప్రస్తుత పరిణామాలు కాస్త ఇబ్బందికరమైనవిగా చెప్పవచ్చు. అయితే మన దేశంలో ప్రస్తుతం ఆషాడం మాసం నడుస్తోంది. అయితే త్వరలోనే శ్రావణమాసం ప్రారంభం అవుతుంది మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అయితే అలాంటి వారు కాస్త ఓపిక పట్టడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సైతం చెబుతున్నారు.
అయితే బంగారం ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో 2025 మూడవ త్రైమాసిక నాటికి గోల్డ్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని సిటీ బ్యాంక్ రిపోర్టులో పేర్కొంది. 2026 నాటికి బంగారం ధర కనీసం 25శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉందని ఈ అధ్యయనంలో పేర్కొంది. ప్రస్తుతం బంగారం ధర అమెరికాలో ఒక ఔన్స్ 3400 డాలర్లు ఉంది. అయితే 2026 నాటికి బంగారం ధర 2400 డాలర్ల నుంచి 2500 డాలర్లకు పడిపోయే ఛాన్స్ ఉందని సిటీ బ్యాంక్ తన రిపోర్టులో పేర్కొంది.

అయితే 2025 క్యూ3లో బంగారం ధరలు భారీగా తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా పసిడి ధరలు తగ్గడానికి ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి రూపంలో డిమాండ్ తగ్గడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివ్రుద్ధి కూడా మెరుగయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడిప్పుడే పెద్దెత్తున అన్ని దేశాలతో మంచి సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా టారిఫ్ ప్లాన్స్ ను కూడా సర్దుబాటు చేసేందుకు యత్నిస్తున్నారు.
ఈ చర్యలన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించే ఛాన్స్ ఉందని కూడా సిటీ బ్యాంకు తన రిపోర్టులో పేర్కొంది. ఇది కూడా బంగారం ధరలు తగ్గేందుకు దోహదపడుతుంది. అలాగే సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోలును భారీగా తగ్గించే అవకాశం ఉంది. ఈ కారణంగా కూడా పసిడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంది.
ఇక గడిచిన ఏడాది కాలంలో చూస్తే బంగారం ధరలు దాదాపు 45శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 2025 ప్రారంభం నుంచి జులై వరకు బంగారం ధర దాదాపు 30శాతం మేర పెరిగింది. ఏప్రిల్ నెలలో గరిష్ట స్థాయికి చేరుకుని 3500 డాలర్లు దాటింది. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర లక్ష దాటింది. సిటీ బ్యాంక్ అంచనాలు చూస్తే మాత్రం రానున్న 6 నెలల్లో బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉందని చెబుతోంది.